భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

‘ఎస్సీ బాయ్స్ హాస్టల్‌ను పునఃప్రారంభించాలి’

WhatsApp Image 2025-12-13 at 7.21.08 PM (1)

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: గోనెగండ్ల మండలంలో మూసివేసిన ఎస్సీ బాయ్స్ హాస్టల్‌ను తక్షణమే పునఃప్రారంభించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మహేంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో హాస్టల్ మూసివేయడంతో అనేక మంది పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హాస్టల్‌ను పునఃప్రారంభించాలని, ఇందుకోసం దశలవారీ ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నూతన గోనెగండ్ల మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పూజారి మునిస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఆన్సర్ ఎన్నికయ్యారు.