భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎమ్మెల్యేలకు ఏడాదికి ఇచ్చే ఐదు కోట్ల నిధులను విడుదల చేయలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. వెల్దుర్తి మండలంలోని యశ్వంత్రావుపేట్, వెల్దుర్తి, బండ పోచంపల్లి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మన ఊరు మనబడి బిల్లులను ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పాత బిల్లులను కూడా చెల్లించడం లేదన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే లాభం లేదని, గ్రామాల అభివృద్ధికి కేంద్రమే నిధులు సమకూరుస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు బాగగౌని మల్లేషం గౌడ్, చిన్నికి కృష్ణయ్య, దుర్గమ్మలను గెలిపించాలని ఆయన కార్యకర్తలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.