భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మూడో విడుతలో పోలింగ్, కౌంటింగ్ జరుగుతున్న అన్ని గ్రామ పంచాయతీలలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధనల ప్రకారం, కౌంటింగ్ కేంద్రాల వద్ద లేదా గ్రామ పంచాయతీలలో ఎక్కడా కూడా నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడడానికి వీలులేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఆంక్షలు డిసెంబర్ 18 ఉదయం 10 గంటల వరకు అమలులో ఉంటాయని వివరించారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.