భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామం, కౌడిపల్లి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
17, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్