భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

కర్నూలులో జిల్లాస్థాయి షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం

2f314069-e1c4-4d8a-9769-8e4e7b157704

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు పట్టణంలోని గుడ్ షెఫర్డ్ పాఠశాల గ్రౌండ్‌లో జిల్లా స్థాయి షూటింగ్ బాల్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను కలుసుకుని పోటీలను ప్రారంభిస్తూ, ప్రతిభావంతులైన అథ్లెట్లను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరుశ రాముడు మాట్లాడుతూ.. తరచుగా పోటీలు నిర్వహించడం వల్ల క్రీడాకారుల్లో నైపుణ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. జట్టు ఎంపిక పర్యవేక్షకుడిగా మురళి వ్యవహరిస్తుండగా, జిల్లా వ్యాప్తంగా 130 మంది బాలురు, 90 మంది బాలికలు పాల్గొంటున్నట్లు జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో మధుసూదన్, కిరణ్ కుమార్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు గీత, నాగేశ్వరి, సులోచన, హాసిని, స్వాతి, విజయ నాయుడు తదితరులు పాల్గొన్నారు.