భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ :
➨ నేడు కేంద్రమంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయి పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్, అమరావతి రహదారుల అనుసంధానంపై చర్చించారు.
➨ ప్రతి జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మంజూరుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారు.
➨ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, నన్నయ్య వర్సిటీలో నూతన భవనాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.
➨ ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
➨ ఈ నెల 22న జనసేన పార్టీలో ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
➨ తెలంగాణ డీజీపీ ఎదుట ఒకేసారి 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఆరుగురు సీనియర్ నాయకులు ఉన్నారు.
➨ ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి 38వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు.
➨ సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
➨ త్వరలోనే తనకు మంత్రి పదవి దక్కుతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
➨ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ సహాయంతో ఆక్రమణలను గుర్తించి సుమారు రూ. 400 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది.
➨ సెమీఫైనల్‌లో భారత్ ఘనవిజయం సాధించింది; ఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.
➨ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
➨ అమెరికాలో గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.