భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

మౌలిక సదుపాయాల కోసం డివైఎఫ్ఐ రాస్తారోకో

WhatsApp Image 2025-12-20 at 6.06.51 PM

భారత్ సమాచార్.నెట్, కర్నూలు : బస్టాండ్‌లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిరసిస్తూ భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల నాయకులు వై. మహేంద్ర, కే. శ్రీనివాసులు మాట్లాడుతూ.. బస్టాండ్‌లో పరిశుభ్రత కరువైందని, కూర్చోవడానికి సీట్లు, టాయిలెట్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

 

కర్నూల్, పత్తికొండ, గుంతకల్లు రూట్లలో ప్రయాణించే వారితో బస్టాండ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుందని, ప్రైవేట్ వాహనాల అడ్డంకులు, దుర్గంధం వల్ల ప్రజలు నరకం చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అటెండర్‌ను నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు అశోక్, రైతు సంఘం కార్యదర్శి సూరి మరియు డివైఎఫ్ఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.