భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, జూన్ 2025, సోమవారంభారత్ సమాచార్

అక్రమ సంబంధం అంటకట్టారని ఇద్దరు ఆత్మహత్య..!

1b6dda13-a97e-40a0-b337-cbe2b5598b80

భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: పురుగులమందు తాగి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన బీబీనగర్ మండలం కొండమడుగులో చోటు చేసుకుంది. బీబీనగర్ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గరి జిల్లా రామంతాపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న బంధబాల సుధాకర్(39), రామంతాపూర్ గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న పాసాల సుష్మిత(35) సమీప బంధువులు. ఇద్దరూ వేర్వేరుగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు సన్నిహితంగా ఉండడంతో ఇద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగుతుందని ఇరు కుటుంబాల్లో తగాదాలు జరుగుతున్నాయి.

 

రిసార్టులో పురుగులమందు తాగి ఆత్మహత్య:

ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో సుష్మితపై ఆమె భర్త కేసు కూడా పెట్టాడు. ఇద్దరు మనస్తాపానికి గురై రెండురోజుల క్రితం బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్ట్స్ రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుధాకర్ తన బావ రంజిత్‌కు వీడియోకాల్ చేసి చెప్పాడు. ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో చెప్పలేదు. రంజిత్ వెంటనే ఉప్పల్ పోలీసుల సాయంతో బీబీనగర్ పోలీసులకు తెలపడంతో అందరూ కలిసి ఆదివారం సాయంత్రం మొబైల్ నెట్వర్క్ ఆధారంగా రిసార్ట్ కు చేరుకొని వారు ఉంటున్న రూమ్ తలుపులు పగులకొట్టి చూడగా ఇద్దరు మృతి చెంది ఉన్నారు. వీరి స్వగ్రామం నల్గొండ జిల్లా కేతేపల్లి. ఇద్దరు వరసకు బావ, మరదలు అవుతారు. ఇరు కుటుంబాలు ప్రస్తుతం రామంతాపూర్ లో నివాసముంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.