భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మానుకోట జిల్లా నెల్లికుదురు మండలం బోటిమీద తండాకు చెందిన నూతన సర్పంచి జాటోత్ రామ్ సింగ్, వావిలాల సర్పంచ్ భర్త గోగుల ప్రశాంత్ యాదవ్, రాజ్య తండా సర్పంచి భర్త ఆనంద్ లు స్థానిక ఎస్సై చిర్ర రమేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సైకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామాల్లో పీస్ ఫుల్ వాతావరణం కల్పిస్తూ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. తమ గ్రామాలు ప్రశాంతమైన వాతావరణంలోనే ఉంటాయని ఏమైనా సంఘటనలు జరిగితే మీ దృష్టికి తీసుకు వస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా ఇంచార్జ్ తవిశెట్టి రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
26, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్