భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని రౌడీషీటర్లు, నేరచరిత్ర గలవారికి పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని సూచించారు. అలాగే వారి జీవనోపాధి వివరాలు తెలుసుకుని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
BHARATH SAMACHAR DIGITAL
28, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్