భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు దేవరాజు, ఖాజా పటేల్ వీధుల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా విశిష్ట సేవ పతకాలు అందుకుని ఘనంగా సత్కరించబడ్డారు. బుధవారం నిర్వహించిన సత్కార కార్యక్రమంలో ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవితో పాటు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రశంసా పత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లను గోనెగండ్ల సీఐ చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
BHARATH SAMACHAR DIGITAL
1, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్