భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, జనవరి 2026, సోమవారంభారత్ సమాచార్

చేరుకులపాడు–కృష్ణగిరి రహదారి అధ్వాన్నం

WhatsApp Image 2026-01-04 at 5.43.49 PM

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: చేరుకులపాడు నుంచి కృష్ణగిరి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో 12కు పైగా భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పైప్ లైన్ల కోసం రైతులు తవ్విన గుంతలు పూడ్చకపోవడంతో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టి గుంతలు పూడ్చాలని, వాహనదారుల భద్రతను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.