భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

ddcbe8aa-bcfa-4590-b68d-5058e5147e5a

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని కోడకంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పటాన్ చెరువు రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌతం విద్యార్థులకు రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్టులు ధరించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు మొగులయ్య, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.