భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లా నిరుద్యోగ యువతీ–యువకులకు ఉపాధి కల్పించడానికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం నంద్యాల పట్టణంలోని ఎస్బిఐ కాలనీలోని శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల ఆవరణలో జరుగనుంది. వికాస శిక్షణ ప్లేస్మెంట్ సంస్థల సహకారంతో జరగబోయే ఈ జాబ్ మేళాలో టెక్ మహీంద్రా, టాటా ఎలక్ట్రానిక్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ప్రీమియర్ ఎనర్జీస్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని మొత్తం 800 ఖాళీలను భర్తీ చేస్తాయి. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.
BHARATH SAMACHAR DIGITAL
8, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్