భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, జులై 2025, శుక్రవారంభారత్ సమాచార్

‘అందుకే చనిపోతున్నా.. వారిని కఠినంగా శిక్షించాలి’

crime-news-18-1

భారత్ సమాచార్.నెట్, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలంలో తీవ్ర విషాదం నెలకుంది. తన చావుకు తన భార్య, అత్తతోపాటుగా కరీంనగర్ మహిళ పోలిస్ స్టేషన్ సీఐ కారణమంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గడ్డిమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

చొప్పదండికి చెందిన కడారి శ్రవణ్‌కుమార్ కరీంనగర్ పట్టణానికి చెందిన ఓ యువతితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత వీరి మధ్య మనస్ఫర్థలు రావడంతో శ్రవణ్ భార్య కరీంనగర్ మహిళా పోలీసు స్టేషన్‌లో గృహహింస, వరకట్నం కేసులు పెట్టింది. దీంతో పోలీసులు శ్రావణ్ ను విచారించారు. విచారణ పేరుతో తనను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని శ్రవణ్ కుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనను భార్య, అత్తతోపాటు కరీంనగర్ మహిళ టౌన్ సీఐ మరికొంత మంది కలిసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కరీంనగర్ సీపీకి తన బాధని వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డి మందు తాగాడు. తనపై ఎకపక్షంగా మహిళ సిఐ తప్పుడు కేసు పెట్టారని, తాను చనిపోయినా తరువాతనైనా నిజాలు తెలుసుకోవాలని, అసలైన దోషులను అరెస్టు చేయాలని వీడియోలో కోరాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా అసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రావణ్ కుమార్ మృతి చెందాడు.

తన కొడుకు భార్య, అత్త, మహిళ పోలీసు స్టేషను సిఐ వేధింపుల వలనే క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడని తన కొడుకు వీడియోలో మొత్తం వివరాలను తెలిపాడని శ్రావణ్ తల్లి చెప్పారు. దీని ఆధారంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి సోదరి, తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.