భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

పెద్దాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందకు కృషి చేస్తా

d3c98119-c668-4ec7-a613-8928db25dc81

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం పెద్దాపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదర్శ గ్రామంగా ఎంపిక చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం తహసిల్దార్ శ్రీనివాస్ గ్రామసభ ఏర్పాటు చేశారు. పైలెట్ ప్రాజెక్టు గ్రామంలో రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలోని పలు సమస్యలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్,గ్రామ సర్పంచ్ రంగారెడ్డి, ఉప సర్పంచ్ లావణ్య రాజు, వార్డ్ నెంబర్ దాసరి అభిలాష్, గ్రామ పెద్దమనుషులు రెవెన్యూ సిబ్బంది ప్రజలు ఇతరులు పాల్గొన్నారు.