భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామ నూతన సర్పంచ్ రాజ నర్సింహ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని గ్రామ యువకులతో కలిసి చేపట్టారు. ముఖ్యంగా పాఠశాలలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను, వర్షాకాలం సీజన్ లో వర్షం తాకిడికి మట్టి కొట్టుకుపోయిన చోట తిరిగి మట్టి పోసి లెవెల్ చేయడం లాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను సర్పంచిగా ఎన్నికైనందున మొదటగా పాఠశాలలో చెత్తాచెదారం తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రతి పౌరుడు విద్యావంతుడై ఉండాలన్న నెపంతో ప్రథమంగా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని సర్పంచ్ రాజానరసింహ అన్నారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు, పాలకవర్గం సభ్యులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
11, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్