భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ గ్రామంలో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా ఇసుకొని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని యువతకు సూచించారు. దేశ ఔన్నాత్యానికి స్వామి వివేకానంద చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిట్టపల్లి రాజేశ్వర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
12, జనవరి 2026, సోమవారంభారత్ సమాచార్