భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

ప్రజలకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు

e68c766d-87fc-465f-967b-6991fe6d79f7

భారత్ సమాచార్, మెదక్ జిల్లా:  జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని.. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకరావాలని ఆకాంక్షించారు. ప్రజలందరు సుఖసంతోషాలతో సుబిక్షంగా ఉండాలని పసిడి పంటలతో పరిడవిల్లాలన్నారు. ఈ భోగి పండగ మన అందరికి భోగా భాగ్యాలు ప్రసాదించాలి అని, కనుమ పండగ కనువిందుగా జరుపుకోవాలని ఈ సంక్రాంతి పండగ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరిసిల్లాలి అని భగవంతున్నీ కోరుకున్నారు. ప్రజలందరికి శుభం చేకూరాలని , ఈ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరారు. సంక్రాంతి సందర్బంగా ఎగరవేసే పతంగుల పట్ల చిన్నారులఫై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, తగు జాగ్రత్తలు తీసువాలని బుడ్డా భాగ్యరాజ్ సూచించారు.