భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి నేతృత్వంలో రీజినల్ రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష చేపట్టి, మునుపటి సమస్యలు, పరిష్కార మార్గాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమస్యల సమగ్ర పరిష్కారానికి కలెక్టర్ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. అధికారుల మధ్య సమన్వయం పెంచి, రెవెన్యూ సేవల నాణ్యతను మెరుగుపరచి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.
BHARATH SAMACHAR DIGITAL
22, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్