భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

తూప్రాన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజ‌యం ఖాయం – నర్సారెడ్డి

WhatsApp Image 2026-01-21 at 7.23.31 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తూప్రాన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ ప్రచారాన్ని నిర్వహించింది. ‘గడపగడపకు కాంగ్రెస్’ నినాదంతో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అంక్షా రెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది వార్డుల్లో డీజే సౌండ్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా కేసీఆర్ తూప్రాన్ ముఖం చూడలేదని, బీఆర్‌ఎస్ దుకాణం మూతపడే సమయం ఆసన్నమైందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్ అభ్యర్థులందరూ చైర్మన్ పదవికి అర్హులేనని, హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పల్లెర్ల రవీందర్ గుప్తా, మామిండ్ల జ్యోతి కృష్ణ, భాస్కర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.