భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, జనవరి 2026, బుధవారంభారత్ సమాచార్

ప్రభుత్వ మౌనంతో తూప్రాన్‌లో ప్రజాస్వామ్య హత్య!

WhatsApp Image 2026-01-27 at 7.55.54 PM (1)

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : తూప్రాన్ పట్టణంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ధర్మ సత్రాన్ని రాత్రికి రాత్రే కూల్చివేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. లక్ష్మీ గణపతి దేవస్థానం నిర్మాణ సాకుతో, మున్సిపల్, రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే ఈ చారిత్రక కట్టడాన్ని నేలమట్టం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఆస్తిని కబ్జా చేసి, దేవాలయం పేరుతో కమర్షియల్ షట్టర్లు నిర్మించి భూదందాకు తెరలేపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారి పెత్తనంపై స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినా ప్రభుత్వం మౌనంగా ఉండటం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని మేధావులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని తూప్రాన్ వాసులు స్పష్టం చేస్తున్నారు.