భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, జనవరి 2026, బుధవారంభారత్ సమాచార్

10వ తరగతిలో 85%కుపైగా మార్కులు సాధించాలి: కలెక్టర్ సిరి

b872be31-84b2-4773-af91-0f46db115655

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 85 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించేలా లక్ష్యంగా పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి విద్యార్థులకు సూచించారు. బుధవారం కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చదువు, చేతిరాతను మెచ్చుకుని, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉదయం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుధాకర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.