భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కర్నూలు నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ సతీశ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కేఎంసీ కార్యాలయంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు నేటి సమాజానికి మరింత అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని, కార్యాలయాలకు వచ్చే ప్రజలతో అధికారులు, సిబ్బంది మర్యాదగా, సహనంతో వ్యవహరించాలని సూచించారు. సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ మేనేజర్ చిన్న రాముడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా కార్యాలయంలో స్మరణ కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారు.
BHARATH SAMACHAR DIGITAL
31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్