భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, ఫిబ్రవరి 2026, గురువారంభారత్ సమాచార్

మున్సిపల్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ రాహుల్ రాజ్

777d815f-a6f1-4a59-b12f-4955e8e59caf

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల్ కౌంటింగ్ కు అన్ని ఏర్పాటు పూర్తి అయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియమాలను పాటించి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పక్రియ జరగాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని, రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయితుందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శాంతి భద్రతకు భంగం కలుగకుండా చర్యకు చేపడుతున్నామన్నారు. కౌంటింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయా చంద్రారెడ్డి, మెదక్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ రాధ కిషన్, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ లు పాల్గొన్నారు.