భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, మార్చి 2026, సోమవారంభారత్ సమాచార్

మాసాయిపేటలో విషాదం: చికిత్స పొందుతూ మృతి

WhatsApp Image 2026-03-01 at 6.40.52 PM

భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్: మాసాయిపేట మండలం ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మద్యం వ్యసనానికి బానిసైన అత్కూరి బాబు (26) అనే యువకుడు, గత నెల 21న మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు మాసాయిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతిగా మద్యం సేవించడం వల్ల ఒక నిండు ప్రాణం బలికావడం స్థానికంగా కలచివేసింది.