భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, మార్చి 2026, బుధవారంభారత్ సమాచార్

ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన

K

భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలంలోని కిష్టంపేట రైతు వేదికలో ఆయిల్‌ పామ్‌, కూరగాయల సాగుపై బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే సైంటిస్ట్ స్రవంతి మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌, మొక్కలను పెంచితే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందవచ్చని తెలిపారు. కూరగాయల సాగు విధానం పై పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో మ్యాట్రిక్స్ ఆయిల్ ఫామ్ సీఈవో ఉదయ్ కుమార్, ఆత్మ చైర్మన్ రవతు సత్తయ్య, ఆర్టికల్చర్ ఏవో సుప్రియ, అగ్రికల్చర్ తాండూర్ మండల్ ఏవో సుష్మా, రైతులు పెరుమాండ్ల భాస్కర్ గౌడ్,గాదె రాజేశం, సీమల రాజలింగం, గుండాల తిరుపతి, మాసాడి తిరుపతి, బోనగిరి చంద్రశేఖర్, జలాల్ పాషా, తదితరులు పాల్గొన్నారు.