భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. మొదటి సంవత్సర పరీక్షలలో జనరల్ విభాగం లో 6085 గాను 5895 విద్యార్థులు హాజరైనారు. ఒకేషనల్ విభాగంలో 279 గాను 260 విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. జిల్లాలో పదకొండవ రోజు హాజరు శాతం 96.71 % గా నమోదైంది. ఈరోజు తో మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడం జరిగింది. ఈ సంవత్సరం ఐదు నిమిషాలు నిబంధన అమలు లో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాల కు చేరుకున్నారు. జిల్లాలో ఉన్న పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం పర్య వేక్షించారనీ ఒక ప్రకటనలో తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
12, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్