భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, మార్చి 2026, సోమవారంభారత్ సమాచార్

News Roundup: న్యూస్ రౌండ‌ప్

news-roundup-1024×703-1-1-2

భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్‌డెస్క్:

➨ రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో సభ మొదలవుతుంది.

➨ ఈ నెల 22న రైతు భరోసా పథకం మొదటి విడత నిధులను విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

➨ తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు (ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు) ప్రారంభం కానున్నాయి.

➨ తెలంగాణలో ప‌దో తరగతి పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

➨ హైదరాబాద్‌లో జరిగిన 8వ అంతర్జాతీయ స్టెమ్ సెల్ కాన్ఫరెన్స్ నేటితో ముగిసింది.

➨ రేపు హైదరాబాద్‌తో సహా 14 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

➨ నల్గొండ జిల్లాలో లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.

➨ మార్చి 16 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

➨ మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.

➨ అంగన్‌వాడీ కేంద్రాలకు 44,346 ఇండక్షన్ స్టౌల పంపిణీకి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

➨ అన్నమయ్య జిల్లా పుంగనూరులో బైక్ పొగ పీల్చి ఊపిరాడక తాతతో పాటు ముగ్గురు మనవళ్లు మృతి చెందారు.

➨ విజయనగరం జిల్లా బొండపల్లిలో 650 కిలోల గంజాయిని నార్కోటిక్ కంట్రోల్ టీమ్ స్వాధీనం చేసుకుంది.

➨ పశ్చిమ గోదావరి జిల్లాలో తాగి తల్లిని చంపిన నిందితుడికి స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది.

➨ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

➨ ఆరు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 9, 23 తేదీల్లో పోలింగ్ జరగనుంది.

➨ ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.

➨ ఢిల్లీ, హర్యానా సహా ఉత్తర భారత రాష్ట్రాలకు ఐఎండీ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.

➨ అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ‘స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్’ జలసంధిని మూసివేసి మైనింగ్ చేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి.

➨ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.

➨ ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలో జరిగిన దాడుల్లో సుమారు 15 మంది మరణించినట్లు అల్ జజీరా వెల్లడించింది.

➨ తైవాన్ సరిహద్దుల్లో చైనా భారీగా సైనిక విమానాలను మోహరించడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.