భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండల అధ్యక్షుడు నీలి నాగేష్ అధ్యక్షతన, కార్య సంఘటన ఇన్చార్జి మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు తేదీ 16-03-2026 17-03-2026 రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమంలో ఏడు అంశాలను విశిష్ట వక్తల ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్తలుగా బుక్క నర్సారెడ్డి , ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు రంజిత్ మోహన్ నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ , మాజీ కౌన్సిలర్ సంఘసాని సురేష్ , మాజీ సర్పంచి రాజేందర్ పాల్గొన్నారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, ఎస్టి మోర్చా జిల్లానాయకులు రాములు నాయక్ , నర్సాపూర్ మండల బీజేపీ కమిటీ, శక్తి కేంద్రం ఇంచార్జీలు, వివిధ మోర్చాల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొని పార్టీ విధి విధానాలను,సిద్ధాంతాలను తెలియపరిచారు.
BHARATH SAMACHAR DIGITAL
17, మార్చి 2026, మంగళవారంభారత్ సమాచార్