భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, మార్చి 2026, శుక్రవారంభారత్ సమాచార్

పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని వినతి

7c14c698-cd78-487c-ad79-c2c810321999

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆశావర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. రెండు నెలలుగా వేతనాలు రాక తాము ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తమపై పని ఒత్తిడి పెరిగిందని, వేతనం సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి తగ్గించాలని, సకాలంలో వేతనాలు మంజూరు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని, డిమాండ్ చేస్తూ పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇంచార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో లత, జె.శోభ, ఎన్.యాదమ్మ, ఎం.రూపా కుమారి, జి.అమృత, ఎన్.సంతారా, కె.మారెస్ బ్యాంగ్, బి.కళావాహి, జి.వినోద, టి.మధేయు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.