భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్

పెట్రోల్ బంకుల్లో తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ

3c581f60-e7c9-44b6-97e9-64ee68b3afdb

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని పెట్రోల్ బంకులను బుధవారం హత్నూర తహసీల్దార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి స్టాక్ రిజిస్టర్లను, పెట్రోల్, డిజిల్ నిల్వ ఉంచే ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు. పెట్రోల్ బంకులో డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా అన్ని విధాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ కొరత అంటూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని పెట్రోల్ బంక్ యజమానులకు నోటీసులు జారీ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ హెచ్చరించారు.