భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అసెంబ్లీ వేదికగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై సభ్యుడు రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తూప్రాన్‌లో కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రజనకు ప్రవీణ్ కుమార్, డీసీసీ కార్యదర్శి బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ.. సారా అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు ఇందిరమ్మ పేరును ప్రస్తావించడం అత్యంత అవమానకరమని మండిపడ్డారు.
దేశం గర్వించే ‘ఉక్కు మహిళ’ను అసంబంధ విషయాల్లోకి లాగడం ఆమెను గౌరవించే కోట్లాది మంది మహిళలను అవమానించడమేనని వారు పేర్కొన్నారు. రాకేష్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆ ప్రసంగాన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల గుండెల్లో నిలిచిన నాయకురాలిని విమర్శిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.