భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, మార్చి 2026, మంగళవారంభారత్ సమాచార్

అరెస్టులకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల నిరసన

WhatsApp Image 2026-03-30 at 7.43.02 PM

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం నెల్లికుదురు మండల కేంద్రంలో ఆశా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు బత్తిని మహేశ్వరి, ఆదిలక్ష్మి, సుజాత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌కు తరలి వెళ్తున్న తమను గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు మండిపడ్డారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల స్థిర వేతనం చెల్లించాలని, తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.