భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లాలోని తెలంగాణ గురుకుల మైనారిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. బైపీసీ విభాగంలో కె. హారిక (438/440) మార్కులతో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించగా, ఎంపీసీలో ఎన్. శృతిక, అఫాహా బేగం (467/470) ద్వితీయ ర్యాంకులను అందుకున్నారు. అలాగే బైపీసీలో ఎ. శ్రావణి (436) రాష్ట్ర తృతీయ ర్యాంకును కైవసం చేసుకుంది.
ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీకి చెందిన పి. అక్షయ (990/1000), బైపీసీలో మరొక విద్యార్థిని 991 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. కళాశాలలో అత్యధిక శాతం విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడంతో మొత్తం ఉత్తీర్ణత 95 శాతంగా నమోదైంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. సురేఖ మాట్లాడుతూ.. విద్యార్థుల కృషితోనే కళాశాల ప్రతిష్ఠ రాష్ట్రవ్యాప్తంగా పెరిగిందని హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులను, సిబ్బందిని అభినందించారు.