భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ శుభ సందర్భంగా, ప్రజాపాలనలో తెలంగాణకు ఇది ఒక కీలకమైన శుభ పరిణామమని మహబూబాబాద్ అర్భన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు ఘనపురపు అంజయ్య అన్నారు. అయన మాట్లాడుతూ మహబూబాబాద్ ముద్దుబిడ్డగా ఎదిగిన నరేందర్ రెడ్డి గౌరవప్రదమైన స్థాయికి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్టు తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
16, ఏప్రిల్ 2026, గురువారంభారత్ సమాచార్