భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పాపన్నపేట మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సీపీఆర్ ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు ప్రాథమిక చికిత్స ఎలా అందించాలో 108 ఈఏంటీ శ్రీకాంత్ ప్రత్యక్షంగా వివరించారు. ముఖ్యంగా గుండెపోటు లేదా ప్రమాద సమయాల్లో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలు నిలబెట్టవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
18, ఏప్రిల్ 2026, శనివారంభారత్ సమాచార్