భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, ఆగస్టు 2025, మంగళవారంభారత్ సమాచార్

నల్లమల అడవిలో చంపేసి.. కత్తి మూసీనదిలో పడేసి..!

mahabubnagar-crime (1)

భారత్ సమాచార్, నాగర్ కర్నూల్: ప్రేమించి పెళ్లాడిన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త భార్యను చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంకొత్తరాయవరం గ్రామానికి చెందిన యువకుడు శ్రీశైలం, దేవరకద్ర మండలం గోటూర్ గ్రామానికి చెందిన యువతి శ్రావణిని ప్రేమించి 2014లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు జన్మించారు. శ్రీశైలం వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అనుమానంతో అంతమొందించాలని ప్లాన్ చేసి:
ఈ నేపథ్యంలో శ్రావణి అక్క భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా అక్క భర్తతో కొన్నేళ్లు సహజీవనం సాగించింది. ఈ క్రమంలో భార్య, పిల్లలను వదిలి శ్రీశైలం హైదరాబాద్‌ వచ్చి వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించాడు. కొన్నాళ్ల క్రితం బావ దగ్గరి నుంచి తిరిగొచ్చిన శ్రావణి పిల్లలతో కలిసి మహబూబ్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్‌నగర్ కాలనీలో ఉంటోంది. ఓ షాపింగ్ మాల్ సెక్యూరిటీ జాబ్ చేసుకుంటూ పిల్లలను చదివిస్తుంది. ఏడాదిన్న క్రితం భర్త శ్రీశైలం, భార్య శ్రావణిలు దాంపత్య జీవితాన్ని పునఃప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోనే వెల్డింగ్ పనులు చేస్తున్న శ్రీశైలం భార్య, పిల్లల వద్దకు వారానికి ఒకసారి వచ్చి వెళ్తుండేవాడు. భర్య వేరే వ్యక్తులతో ఛాటింగ్ చేస్తోందని గ్రహించిన భర్త శ్రీశైలం శ్రావణీని కొట్టాడు. దీంతో శ్రావణీ మహిళ పోలీస్టేషన్‌లో శ్రీశైలంపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అనంతరం కొద్ది రోజుల క్రితం ఇంట్లో వేరొకరితో శ్రావణి చనువుగా ఉండడాన్ని గమనించిన శ్రీశైలం జీర్ణించుకోలేకపోయాడు.

గొంతు కోసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు:
ఎలాగైన సరే తన జీవితాన్ని నాశనం చేసిన శ్రావణీని అంతమొందించాలని శ్రీశైలం ప్లాన్ చేశాడు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ సండే మార్కెట్‌లో కత్తి కొనుగోలు చేశాడు. ఇక భార్య శ్రావణికి ఈ నెల 20వ తేదిన ఫోన్ చేసి 21న సోమశిల చూడడానికి వెళ్దామని చెప్పాడు. భర్త మాటలను నమ్మిన శ్రావణి సరే అని చెప్పింది. పథకం ప్రకారం హైదరాబాద్ నుంచి శ్రీశైలం బైకుపై మహబూబ్‌నగర్‌కు వచ్చాడు. తన వెంట ఎర్రగడ్డ మార్కెట్‌లో కొన్న కత్తిని తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి సోమశిలకు ప్రయాణం అయ్యారు. ఇక పెద్దకొత్తపల్లి సమీపంలోకి చేరుకోగానే శ్రీశైలం తన ప్లాన్‌ను అమలు చేశాడు. ఈ పక్కనే అడవి ఉందని, చాలా సీతాఫలాలు ఉంటాయని నమ్మించి సాతాపూర్, మారేడుమానుదిన్నె రహదారి పక్కన ఉన్న నల్లమల అడవిలోకి తీసుకెళ్లాడు. ఇక శ్రావణి చున్నీని ఆమె మెడకు చుట్టి గట్టిగా నులిమి పట్టుకున్నాడు. అనంతరం వెంటతెచ్చుకున్న కత్తితో శ్రావణి శరీరంపై విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో శ్రావణి కిందపడిపోయింది. కొన ఊపిరితో ఉన్న ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం బైక్ నుంచి ఖాళీ బాటిల్‌లో పెట్రోల్ తీసి శ్రావణి డెడ్‌బాడీపై చల్లీ దహనం చేశాడు.

కత్తి మూసిలో వేసి, ఫోన్ దుర్గంచెరువులో పడేసి:
శ్రీశైలం ఎంజీబీఎస్ వద్ద ఉన్న మూసీ నదిలో హత్యకు ఉపయోగించిన కత్తిని పడేశాడు. పదే పదే ఫోన్లు వస్తుండడంతో భార్య ఫోన్‌ను దుర్గంచెరువులో విసిరేశాడు. శ్రీశైలం నేరుగా నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. జరిగిన హత్యోదోంతం మొత్తం పోలీసులకు వివరించి తానే తన భార్య శ్రావణిని హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని తీసుకొని ఘటనస్థలికి వెళ్లిన పోలీసులు దాదాపుగా దహనం అయిన శ్రావణి డెడ్‌బాడీని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

 

మరిన్ని కథనాలు:

అక్రమ సంబంధం అంటకట్టారని ఇద్దరు ఆత్మహత్య..!