భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట మండలంలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి సక్కుబాయి, నారాయణఖేడ్ పట్టణానికి చెందిన సుధాకర్ అలియాస్ సిద్దు సంగారెడ్డిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సుధాకర్, సక్కుబాయి గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. సక్కుబాయి పెళ్లి చేసుకుందామని అడగడంతో సుధాకర్ రెండునెలల నుంచి ఫోను మాట్లాడటం మానేసి నెంబర్ బ్లాక్‌లో పెట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె తాళ్లపల్లి తండాలో తన ఇంటి వద్ద గడ్డి మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బహదూర్ పల్లిలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. సక్కుబాయి చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి కేశ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
BHARATH SAMACHAR DIGITAL
4, సెప్టెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్