భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, ఏప్రిల్ 2026, మంగళవారంభారత్ సమాచార్

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి: కడారి నాగరాజు

242cd4b3-a7c0-4719-a174-669652f0e434

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మిషన్ భగీరథ లో పని చేస్తున్న కార్మికులకు గత 6 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం సరైనది కాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు అన్నారు. మంగళవారం చిలిపచేడ్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు సరైన వేతనం ఇవ్వకపోను ఇచ్చే వేతనం 6 నెలలుగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో కార్మికులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని తెలిపారు.

 

చికాగో నగరంలో కార్మికుల ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న పనిగంటల తగింపును ఇప్పటి ప్రభుత్వం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కొడ్స్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తుందని, లేబర్ కొడ్స్ అమలు చేయడం అంటే కార్మికుల హక్కులను పెట్టుబడిదారులకు కట్టబెట్టడమే అవుతుందని అన్నారు. బ్రిటిష్ కాలం నుంచే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను తొలగించడం సిగ్గుచేటు అన్నారు. దేశం మొత్తం కరోనా తో అతలాకుతలం అవుతుంటే దూర్మార్గంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం 2019, 2020 లో 4 లేబర్ కోర్డు లు తీసుకురావడం దేనికి సాంకేతమని ప్రశ్నించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో సంపనులు పెరిగారని, నిరంతరం కాష్టపడుతున్న కార్మికులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందని గుర్తుచేసారు. మే డే స్పూర్తితో దేశంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 1 నుంచి 7 వరకు మే డే వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శేఖర్, నవీన్, నర్సింలు, మల్లేశం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.