భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, ఏప్రిల్ 2026, బుధవారంభారత్ సమాచార్

పెద్ద తండాలో దుర్గాదేవికి ఘనంగా బోనాల జాతర

bc7370fc-69b9-4efe-a46f-d9af97685b32

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అత్యంత భక్తి శ్రద్ధలతో ఇనుగుర్తి మండలం పెద్దతండ(సీఎం)లో జగజ్జనని దుర్గాదేవికి మంగళవారం ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో లోకపావని దుర్గామాతకు తండాలోని గిరిజన మహిళలు డప్పుచప్పుళ్లు, డీజేల హోరులో బోనాలను నెత్తిన ఎత్తుకొని శివశక్తుల పూనకాల మధ్య తరలివెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించుకున్నారు. సర్పంచి బానోతు రేణుక నరేష్ తోపాటు గ్రామస్తులు, మహిళలు తండాను పాడిపంటలతో ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఎంపీడీవో పార్థసారథి తదితర అధికారులు వేడుకలలో పాల్గొన్నారు. అంతకుముందు సోమవారం ఐదవ వార్షిక ఉత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామి పంచ వార్షిక వేడుక అశేష భక్తజన సందోహం మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో తండాలోని వివిధ పార్టీల నాయకులు, తండావాసులు పాల్గొన్నారు.