భారత్ సమాచార్.నెట్, వెబ్‌డెస్క్:
➨ తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను మే నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.
➨ ప్రజా దర్బార్‌లో వస్తున్న దరఖాస్తుల్లో మెజారిటీ ఇళ్ల కోసమే ఉంటున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహ సాయం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
➨ సిద్దిపేటకు చెందిన 9 ఏళ్ల బాలుడు ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు.
➨ హైదరాబాద్ నగరంలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
➨ ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరం, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
➨ కార్మికుల కోసం త్వరలోనే సమగ్ర సామాజిక భద్రతా చర్యలు అమలు చేస్తామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు.
➨ అమరావతిలో 500 పడకల సెకండరీ హాస్పిటల్, 150 పడకల సూపర్ స్పెషాలిటీ ESIC మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
➨ ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకు ‘లేబర్ అడ్డా’ ప్రాజెక్టును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
➨ కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం సర్వీస్ ఓటర్ల ఓట్లతో కలిపి 79.7 శాతానికి పెరిగిందని ఎన్నికల కమిషన్ తెలిపింది.
➨ కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. సాయంత్రం కల్లా ఫలితాలు వెలువడనున్నాయి.
➨ పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలోని అన్ని 285 పోలింగ్ స్టేషన్లలో మే 21న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
➨ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో యూపీఐ లావాదేవీలు గత ఏడాదితో పోలిస్తే 25% పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.
➨ ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలను అంగీకరించే అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
➨ హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని, అణు కార్యక్రమాలను నిలిపివేయాలని జర్మనీ విదేశాంగ మంత్రి ఇరాన్‌ను డిమాండ్ చేశారు.
➨ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దక్షిణ లెబనాన్‌లో ఒకరు మృతి చెందగా, పలువురు సహాయక సిబ్బంది గాయపడ్డారు.
➨ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూటమి నుంచి వైదొలిగినప్పటికీ, సౌదీ అరేబియా, రష్యా సహా ఇతర దేశాలు చమురు ఉత్పత్తి కోటాను పెంచాలని నిర్ణయించాయి.
➨ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
➨ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
➨ 2026 మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపికపై కసరత్తులు జరుగుతున్నాయి. సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభకు అవకాశం దక్కనుంది.
➨ నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యర్థి ఆటగాడికి అభ్యంతరకర రీతిలో సెండాఫ్ ఇచ్చినందుకు కైల్ జేమీసన్‌ను బీసీసీఐ మందలించింది.