భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, సెప్టెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

మునుగోడు నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తా: రాజగోపాల్ రెడ్డి

4050f194-523f-4ef0-ace7-8bc370241e0e

భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ మోడల్ పాఠశాల, జూనియర్ కళాశాల వసతి గృహాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థినుల డార్మెటరీ హాల్, డైనింగ్ హాల్, వంటగది, బాత్రూంలను పరిశీలించారు. నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచినప్పటికీ విద్యార్థులకు పెట్టె భోజనంలో నాణ్యత ఉండడం లేదని అన్నారు. అనంతరం మోడల్ పాఠశాలను పరిశీలించారు. తరగతిగదులు, ఆటస్థలం పరిశీలించి మోడల్ పాఠశాల అభివృద్ధికి స్థానిక నాయకులతో కమిటీ ఉంటుందని, వారందరూ వచ్చి మోడల్ పాఠశాలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయన్న విషయాలకు సంబంధించి పరిశీలన చేసి పరిష్కరిస్తారని తెలిపారు.

అనంతరం మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలకు చేరుకొని రూ. 1 కోటి 25 లక్షల తన సొంత ఖర్చుతో నిర్మిస్తున్న తొమ్మిది నూతన తరగతి గదులను, 30కి పైగా బాత్రూంలు, లెట్ రూమ్ లను, మురుగునీటి వ్యవస్థను పరిశీలించారు. కస్తూరిబా పాఠశాల ఆవరణలో ఉన్న విద్యుత్ స్తంభాలను తీగలను వెంటనే తొలగించాలని విద్యుత్ అధికారులను ఫోన్లో ఆదేశించారు. కస్తూరిబా పాఠశాల విద్యార్థినులకు ఆడుకోవడానికి నూతన ఆటస్థలం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను సర్వే చేయించి ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని అక్కడే ఉన్న రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆట స్థలాన్ని ప్రభుత్వ భూమి ఎంతవరకు ఉంటే అంతవరకు విస్తరించాలని సూచించారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డ తోపాటు మండల ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.