భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, సెప్టెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

సమాజ చైతన్యంలో జర్నలిస్ట్‌ల పాత్ర అద్వితీయం: కర్నె రవి

f0741614-607a-451f-b258-53a7df7ba2ea

భారత్ సమాచార్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా: సమాజాన్ని చైతన్యపర్చడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి
అన్నారు. జర్నలిస్ట్ డే సందర్భం గా సీనియర్ జర్నలిస్టులు ఈరెల్లి కిషోర్, మారాసు సుధీర్ లను శనివారం మణుగూరులోని ఆయన కార్యాలయంలో శాలువాలు కప్పి పూలమొక్కను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. జర్నలిస్టులు పేదలకు మేలు చేసే వార్తలు, కథనాలు రాయాలని సూచించారు. చట్టాలపై పేదలకు అవగాహన కల్పించేలా వార్తలు రాసి, ప్రజలను చైతన్య పరచాలన్నారు. జర్నలిస్టులు ఎప్పుడు అద్దంలా ఉండాలని, విలువలు పెంపొందించుకోవాలని, నిజమైన వార్తలు ప్రచురించాలని, విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. మండలంలోని జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంకేఎం రాజు, సామాజిక సేవకులు కర్నేబాబురావు తదితరులు పాల్గొన్నారు.