భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, మే 2026, గురువారంభారత్ సమాచార్

ఇనుగుర్తి జెడ్పీ స్కూల్ పడమర ద్వారం పునఃప్రారంభానికి పరిశీలన

WhatsApp Image 2026-05-13 at 6.11.28 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: చారిత్రక నేపథ్యం కలిగిన ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ద్వారం తిరిగి తెరుచుకోనుంది. గత కొన్ని సంవత్సరాలుగా మూసివేసి ఉన్న ఈ పశ్చిమ ద్వారం ద్వారా రాకపోకలను పునరుద్ధరించేందుకు బుధవారం ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జంగా రూపారాణి, స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, ఫిజికల్ డైరెక్టర్ ప్రణయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గేటుకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు, పాఠశాల బోర్డు ఏర్పాటుపై వారు చర్చించారు.

ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో కలకలలాడిన ఈ పాఠశాలకు చావడి మెయిన్ బజార్ వైపు ఉన్న పడమర గేటే ప్రధాన ద్వారంగా ఉండేది. ఈ గేటు ద్వారానే పాఠశాలకు వెళ్లిన ఎంతో మంది అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారులుగా, కవులు, కళాకారులుగా, మేధావులుగా ఎదిగి ఊరికి పేరు తెచ్చారు. అయితే, వాస్తు కారణాలో లేదా ఇతర ఇబ్బందుల వల్లనో తెలియదు కానీ, గత కొన్నాళ్లుగా ఈ గేటుకు తాళం వేసి ఉత్తరం వైపు గేటును వాడుతున్నారు. ప్రస్తుత ఉత్తర ద్వారం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అంత అనుకూలంగా లేకపోవడంతో, పాత వైభవాన్ని గుర్తు చేస్తూ మెయిన్ గేటును తిరిగి తెరవాలని నిర్ణయించారు. మళ్లీ పశ్చిమ ద్వారం ద్వారా పాఠశాల ప్రవేశం కల్పించేలా చర్యలు చేపట్టడంపై స్థానిక గ్రామస్తులు, క్రీడాకారులు, విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.