భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, మే 2026, శుక్రవారంభారత్ సమాచార్

ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతుల నిరసన

17c84593-f483-457d-acb1-a39ca331ae8a

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు జరగడంలేదని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నర్సాపూర్ మండలం తుజాల్పూర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గతవారం పది రోజులుగా కల్లాల నుంచి ధాన్యం సేకరణ జరగడంలేదని రోజుల తరబడి కల్లాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో రైతులు వడ్లను పారబోసి మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన సందర్భంగా పోలీసులతో రైతులు వాగ్వాదం కొనసాగించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు నిర్వహించాలని లేకుంటే ఆందోళనలను ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.