భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సమ్మర్ క్యాంప్‌కు చేయూతనిస్తున్న దాతలకు అభినందనలు అని దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ దార్ల రామ్మూర్తి, పరుపాటి దేవేందర్ రెడ్డి, కర్ర మధుసూదన్ రెడ్డి, బోల్ల కొమురయ్యలు తెలిపారు. మండల కేంద్రం ఇనుగుర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో వందేమాతరం ఫౌండేషన్, ఎన్ఎఫ్ హెచ్‌సి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వేసవి శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో బాల బాలికలకు వజిన పల్లి శ్రీధర్ ఇచ్చిన రు.2వేల విరాళంతో బుధవారం అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాతల సహకారంతోనే విద్యార్థులకు వేసవి శిబిరం విజయవంతంగా కొనసాగుతున్నదని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వాలంటీర్లు బోధనా అంశాలతో పాటు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు.
BHARATH SAMACHAR DIGITAL
21, మే 2026, గురువారంభారత్ సమాచార్