భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, మే 2026, శుక్రవారంభారత్ సమాచార్

ధాన్యం దిగుమతికి ఏర్పాట్లు పూర్తి: తహశీల్దార్

WhatsApp Image 2026-05-21 at 6.37.32 PM (2)

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తహశీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ నర్సింగ్ యాదవ్ తెలిపారు. గురువారం మండల పరిధిలోని పలు రైస్ మిల్లులను ఆయన పరిశీలించారు.

రైస్ మిల్లుల వద్ద మూడు రోజులుగా ధాన్యంతో నిలిచిపోయిన ట్రాక్టర్లు, లారీల పరిస్థితిని తహశీల్దార్ పరిశీలించారు. వెంటనే హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యం దిగుమతి చేపట్టాలని మిల్లు యజమానులకు సూచించారు. సీరియల్ పద్ధతిలో లారీలు, ట్రాక్టర్లలో ఉన్న ధాన్యాన్ని దిగుమతి చేస్తామని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.