భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో శివంపేట మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, కమిటీ ఛైర్మన్ ఎం. హేమలత పాల్గొని మాట్లాడారు. శివంపేట్, నర్సాపూర్ పరిధిలోని అనాథ, వృద్ధాశ్రమాల నిర్వాసితులకు ప్రభుత్వ పింఛన్లు, సంక్షేమ పథకాలు అందించాలని కమిటీకి వినతులు వచ్చాయని తెలిపారు.
దీనిపై లీగల్ సర్వీస్ ద్వారా పి.ఎల్.సి. నమోదు చేసి అధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. అనాథలు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, ఆధార్ కార్డులు సకాలంలో అందేలా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శివంపేట్ ఎంపీడీవో ఎం.వి. లక్ష్మమ్మ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి సౌమ్య, డిప్యూటీ తహశీల్దార్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.