భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, మే 2026, సోమవారంభారత్ సమాచార్

అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవు

WhatsApp Image 2026-05-24 at 7.00.27 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టులను జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన ప్రైవేట్ వాహనంలో, మాఫ్టీలో తిరుగుతూ ఆదివారం తూప్రాన్ టోల్‌గేట్ వద్ద ఉన్న తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. వాహనాల తనిఖీ విధానం, రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమతి పత్రాలను పరిశీలించాలని, వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది రిఫ్లెక్టివ్ జాకెట్లు, ట్రాఫిక్ బ్యాటన్స్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.